కాంగ్రెస్ పార్టీలో కి బీఆర్ఎస్ బీజేపీ నుంచి భారీ చేరికలు !.


👉 బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు!


J . SURENDER KUMAR,

ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో  బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుండి భారీ సంఖ్యలో పలువురు నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులు, ,గ్రామ సర్పంచ్ కాసారపు బాలగౌడ్, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో  బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి  సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పారు

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..  

 


కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ప్రభుత్వంపై నమ్మకంతో వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని అన్నారు.

👉 గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీలు ఇచ్చి వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

👉 అదేవిధంగా బీజేపీ నాయకులు తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి ఉందని, ముందుగా తమ పార్టీ అభ్యర్థులను సిద్ధం చేసుకుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయాలని మంత్రి వ్యాఖ్యానించారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో గతంలో పనిచేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాలనలో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగాయని మంత్రి విమర్శించారు. గత పాలనలో జరిగిన విషయాలను ప్రజలు గమనించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.