👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ డాక్టర్ చక్రపాణి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన అనంతరం తొలి చైర్మన్‌గా డాక్టర్ చక్రపాణి ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు.
పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల అపారమైన గౌరవం కలిగిన చక్రపాణి చైర్మన్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో అంకితభావంతో ఆయన ఎన్నో సేవలందించారని కొనియాడారు.

డాక్టర్ చక్రపాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
👉 కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ….!
టీజీఎస్ ఆర్టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
👉 ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతు పై ఆరా..,!
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
