దీపావళి వేడుకల్లో మంత్రి  లక్ష్మణ్ కుమార్ !

👉 పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – మంత్రి !

J.SURENDER KUMAR.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, లబ్ధిదారుల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి ఇళ్లలోనే దీపావళి పండుగ వేడుకలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ధర్మపురి పట్టణంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ధర్మపురి పట్టణంలోని మొదటి వార్డులో బత్తిని రజిత–రమేష్ మరియు నాయిని అనూష–శ్రీనివాస్ కుటుంబాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద నిర్వహించిన దీపావళి వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సంబంధిత అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

👉ఈ సందర్భంగా మంత్రి  లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, పండుగ వేడుకల్లో పాల్గొని వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి కేవలం నివాసం మాత్రమే కాదని, ఆత్మగౌరవానికి, భద్రతకు, భవిష్యత్తుపై భరోసాకు ప్రతీక అని పేర్కొన్నారు.

👉 ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరుస్తూ, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. పండుగల సమయంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి వేడుకలు జరుపుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతోందని పేర్కొన్నారు.

👉 ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

👉 ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

👉 దశలవారీగా ప్రజా సమస్యల పరిష్కారం..సీఎం చోరవతో నియోజకవర్గ అభివృద్ధి..!


👉 దోనూరులో ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ..!

ధర్మపురి నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చొరవతో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండగ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో ఎదుల మమత – రాములు ఆదివారం ఇందిరమ్మ ఇంటి వద్ద నిర్వహించిన దీపావళి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ నాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యను పట్టించుకోలేదని అన్నారు


👉 ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతే పంటలు పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ₹ 40 కోట్లతో ప్రారంభించిన రోళ్ళ వాగు ప్రాజెక్టు అంచనాలు ₹140 కోట్లకి పెంచి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.


👉 ధర్మపురి నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి రూపాయలు ₹ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మాణం చేస్తున్నామని నియోజకవర్గానికి ఇప్పటికే ఐటిఐ తో పాటు డిగ్రీ కళాశాల బస్సు డిపో మంజూరు అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చోరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తున్నట్టు మంత్రి తెలిపారు.


👉 దోనూరు గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని మంత్రి తెలిపారు.


👉 కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పురుషోత్తం తో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుమల లక్ష్మణ్,  వేముల రాజు, నరసింహులు తో పాటు ధర్మపురి నియోజకవర్గ మండలంలోని పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.