ఇందిరమ్మ ఇంటికి పేదరికమే కొలమానం.!

👉 గొల్లపల్లి మండలంలో దీపావళి వేడుకల్లో …


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


J.SURENDER KUMAR,


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానంగా ఎంపిక జరిగిందని రానున్న రోజుల్లో అందించే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సైతం పేదరికం కొలమానంగా జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ  మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాల్లో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఎనగందుల శంకరమ్మ లక్ష్మయ్య దంపతుల ఇంటి వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆర్యవైశ్య భవన్లో నిర్వహించిన ముఖ్యమంత్రి  జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన సందర్భంగా ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలను ఈ సందర్భంగా మంత్రి అందజేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి పండుగ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనేక ఏళ్లుగా పేద ప్రజలు ఇంటి నిర్మాణం చేసుకోవాలనే తపన ఉన్నప్పటికీ ప్రభుత్వము నుండి సహకారం లేక వారి ఆశ నిరాశగా ఉండేదని అన్నారు.

👉రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం రూ. 5 ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయానికి లబ్ధిదారులు తమ వంతు వాటా కలిపి ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

👉పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిన సందర్భంగా వారి మధ్య దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

👉ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని మరో రెండు వేల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇస్తామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిరుపేదల అందరి కలలు నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.


👉 ధర్మపురిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..!

👉 లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. కేక్ కట్ చేసి సంబరాలు!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందుగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

👉 స్థానిక మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి రాజేష్ మాట్లాడుతూ….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదులని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

👉 జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు చిపిరిశెట్టి రాజేష్, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.