ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు !


J.SURENDER KUMAR,

ఒకవైపు దీపావళి పర్వదినం మరోవైపు జన్మదినం, ఈ రెండు శుభసందర్భాల జ్ఞాపకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో ఆదివారం దీపావళి పండుగను జరుపుకున్నారు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ముఖ్యమంత్రి  ప్రారంభించారు.


👉 ఈ శుభ సందర్భంగా దంపతులకు ముఖ్యమంత్రి  నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం వారింట్లోనే సన్నబియ్యంతో వండిన భోజనాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి తో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ సీతక్క , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు సన్నబియ్యం భోజనం చేశారు.


👉 ఆ తర్వాత అక్కడ సీఎం చుట్టూ చేరుకున్న పిల్లలు టపాసులు కాల్చగా ముఖ్యమంత్రి  వారితో కలిసి “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పిల్లలందరికీ పెన్నులను బహూకరించారు.