J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి పండుగ వేడుకలను తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. వివిధ అభివృద్ధి పనులను ఆదివార ప్రారంభించారు.
👉 జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవం !

వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కళాశాల తరగతి గదులు, సిబ్బంది గదులను పరిశీలించారు.
దీపావళి పండుగ రోజున జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
👉 పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం !
వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది గదులను పరిశీలించి, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దీపావళి పండుగ శుభసందర్భంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , వాకిటి శ్రీహరి , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి , ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
👉 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం !

వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట్‌లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
దీపావళి పండుగ శుభసందర్భంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , వాకిటి శ్రీహరి , ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన ప్రారంభం!

దీపావళి పండుగ సందర్భంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. NATCO ట్రస్టు సీఎస్ఆర్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు , వాకిటి శ్రీహరి , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి , ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
👉 పోలీస్ స్టేషన్ భవన ప్రారంభం !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 పోలీస్ స్టేషన్ భవనం సర్కిల్ కార్యాలయ ప్రారంభం !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పట్టణంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించారు. తర్వాత భవనం మొత్తం పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , వాకిటి శ్రీహరి , ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
👉 జూనియర్ కళాశాల భవన ప్రారంభం !

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు
