మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి..!

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం లోని చందోలి, చిల్వకోడూర్  గ్రామాల్లో అనారోగ్య భారీన పడి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరామర్శించి ఓదార్చారు.

మండలంలోని చందోలి గ్రామానికి చెందిన పిట్టల రమేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. గత నెల 25వ తేదీన తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆయన మృతి చెందారు. సమాచారం తెలిసిన మంత్రి  లక్ష్మణ్ కుమార్ చందోలిలోని రమేశ్ నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి  నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, రమేశ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

👉 లాస్య కుటుంబాన్ని..

మండలం లోని  చిల్వకోడూరు గ్రామానికి చెందిన జక్కుల లచ్చయ్య, కవిత దంపతుల కుమార్తె లాస్య అనారోగ్యంతో  మృతి చెందింది. మంత్రి లక్ష్మణ్ కుమార్ లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి లాస్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .


ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ₹10 వేల ఆర్థిక సాయం అందించారు అలాగే ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.