కోటి దీపోత్సవంకు  ఆహ్వానం !


J SURENDER KUMAR,


ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని ఎన్‌టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి  ఆహ్వానించారు. నరేంద్ర చౌదరి శుక్రవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ని కలిశారు.


👉 నిశ్చితార్థ వేడుకకు…


  హైదరాబాద్‌లోని జూబ్లీ కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్  కుమార్తె డాక్టర్ గాయత్రి, రామ్ నాయక్‌ల నిశ్చితార్థ వేడుకకు హాజరై, కాబోయే వధూవరుల ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు.


👉 అభిమానిని అభినందించిన సీఎం…!


ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని కలుసుకోవాలన్న బలమైన ఆకాంక్షతో ఓ అభిమాని ఏకంగా కర్నూలు జిల్లా ఆదోని నుంచి కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు.

ఆదోనికి చెందిన తాయన్న దాదాపు 350 కి.మీ. మేర కాలినడకన ప్రయాణించి, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి ని శుక్రవారం కలుసుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.

అక్టోబర్ 29న కర్నూలు జిల్లా ఆదోని నుంచి బయలుదేరిన తాయన్న, 9 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తాయన్నకు శాలువా కప్పి ఆత్మీయంగా అభినందించారు.


👉 నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం..!


ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని సినీనటుడు తేజ సజ్జా  ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి, తన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు.