👉 జడ్జి శ్రీమతి అనురాధ..!
J SURENDER KUMAR,
విద్యాలయాలలో విద్యతో పాటు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఉపాధ్యాయ వర్గం విద్యను బోధించాలని నేటి విద్యార్థులే రేపటి భావి భారత నూతన సమాజ నిర్మాతలని మంచిని న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీమతి బి అనురాధ అన్నారు.
విద్యార్ధులకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలని లక్ష్యంగా మంథని బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె రఘోత్తం రెడ్డి, న్యాయవాదులు శశి భూషణ్ కాచే, న్యాయవాదులు, లెక్చరర్లు, విద్యార్థినిలు, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రావుల తిరుమల, తదితరులు పాల్గొన్నారు
