J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి ని శుక్రవారం డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం స్థానిక లైన్స్ క్లబ్ సభ్యులు లయన్స్ క్లబ్ సభ్యుల సన్మానించారు.

ధర్మపురి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి సమావేశ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ…..

లయన్స్ క్లబ్ సంస్థ సమాజ సేవలో విశేషమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. ముఖ్యంగా కంటి వైద్య శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, యువతకు ప్రోత్సాహం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
