లబ్ధిదారులకు ₹ 52 లక్షల ఆర్థిక సహాయం !

👉 ధర్మపురి మండలంలో.CMRF చెక్కుల పంపిణీ చేసిన
మున్సిపల్ చైర్మన్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ !

👉 నక్కలపేట ఇందిరమ్మ కాలనీలో 11 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల మంజూరు పత్రాలు అందజేత..!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఇళ్ల లబ్ధిదారులు !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలోని స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మండలనికి చెందిన సుమారు 177 మంది లబ్ధిదారులకు మొత్తం ₹ 52 లక్షల 36 వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి రాజేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్  లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

అనంతరం ధర్మపురి పట్టణంలోని నక్కలపేట ఇందిరమ్మ కాలనీలో 11 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇంటి పత్రాలు అందజేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్  స్థానిక కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రజాప్రతినిధులకు, సంబంధిత శాఖల అధికారులకు మరియు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు , సర్పంచ్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు