మాజీ ఎంపీపీ భీమయ్య ను పరామర్శించిన మంత్రి అడ్లూరి !

J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండల మాజీ ప్రజా పరిషత్ అధ్యక్షుడు సౌల్లా భీమయ్య ను, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.


గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో భీమయ్య చికిత్స పొందుతున్నారు. మంత్రి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గూర్చి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.