J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేటి సాయంత్రం (గురువారం )సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6 అంతస్తులో సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం అత్యవసర నోట్ జారీ చేశారు.

ప్రధానంగా డిసెంబరు 8, 9 తేదీల్లో భారత్ ప్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణ, ఏర్పాట్లతో పాటు ఎల్నినో ప్రభావం, కరువు మండలాలపై చర్చ తదితర అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనున్నది.
