👉 భూమి పూజలు, ప్రారంభోత్సవాలు, చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో ₹ 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మరికొన్ని పనులను ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
👎
శంకుస్థాపనల వివరాలు:
👉 దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్కోచోట ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం.!
👉 జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో ₹15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం.!
👉 ₹ 13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణం.!
👉 చిన్నకోడూరు మండలంలో ₹ 7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో ₹ 7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం.!
👉 జనగామ నియోజకవర్గంలో ₹ 6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం.!
👎
ప్రారంభోత్సవాల వివరాలు:
👉 సిద్ధిపేట జిల్లాలో ₹ 54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లు.!
👉 కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ₹ 14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, ₹ 12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్.!
👉 ₹ 6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు.!
👉 రాయపోల్ మండలంలో ₹ 3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం.
గజ్వేల్లో ₹ 1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం.
