సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర!

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సిద్దిపేట పట్టణంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి  ముస్తాబాద్ చౌరస్తా చేరుకుని అక్కడ దివంగత ఇందిరా గాంధీ  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తర్వాత అక్కడి నుంచి 2 కి.మీ. మేర పాదయాత్రగా సిద్దిపేట బైపాస్ రోడ్డు నాగదేవత ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.