సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ.!

👉 ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి..!


J.SURENDER KUMAR,

సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్య‌మ‌వుతుంద‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు అందించాల‌నేదే త‌మ ల‌క్ష్య‌మని చెప్పారు.

👉 వ్య‌వ‌సాయ రంగంలో బహుముఖ సేవలు అందించిన ప్ర‌ముఖుల‌కు ‘ఇందిరా గాంధీ కృషి ర‌త్న’ పుర‌స్కారాల‌ను ముఖ్య‌మంత్రి  త‌న నివాసంలో అంద‌జేశారు. వ్య‌వ‌సాయ రంగానికి సేవ‌లు అందించిన శాస్త్ర‌వేత్త‌లు, పాత్రికేయులు, రైతుల‌ను తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిషన్ ఈ అవార్డుల‌కు ఎంపిక చేసింది.


👉 అవార్డులకు ఎంపికైన డాక్ట‌ర్ ఎం.సుగుణాక‌ర్ రెడ్డి, డాక్ట‌ర్ ఎస్‌.డి.శిఖామ‌ణి (వ్య‌వసాయ శాస్త్ర‌వేత్తలు), ఆర్. దిలీప్ రెడ్డి (పాత్రికేయుడు), లోనావ‌త్ శాంతా బాయి (గిరిజ‌న రైతు), కె.లావ‌ణ్య (సేంద్రియ రైతు)  ఇందిరా గాంధీ కృషి ర‌త్న పుర‌స్కారాలను ముఖ్యమంత్రి  చేతులమీదుగా అందుకున్నారు.

👉 ప్ర‌ధాన‌మంత్రిగా ఇందిరా గాంధీ వ్య‌వ‌సాయభివృద్ధికి అందించిన చేయూత‌, ఆ కాలంలో సాగు రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిష‌న్ రూపొందించిన పుస్త‌కాన్ని ఈ సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు.


👉 కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌ కుమార్ గౌడ్ , రాష్ట్ర రైతు క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఎం. కోదండ రెడ్డి , క‌మిష‌న్ స‌భ్యులు కె.వి.ఎన్‌. రెడ్డి, ఎం. భ‌వాని రెడ్డితో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.