👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు భాగస్వామ్యం కావాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాoగులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,
అన్నారు.

జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ లు, వార్డు కౌన్సిలర్లు, మరియు గ్రామ సర్పంచులకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్ లో బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి.రాజ గౌడ్, జిల్లాస్థాయి అధికారులు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మెట్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ , కౌన్సిలర్లు, సర్పంచులు, వివిధ స్థాయిల అధికారులు, వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు తమ బాధ్యత గుర్తించుకొని 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పెండింగ్ ఫైళ్ళు మరియు క్లియరెన్స్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈవిషయంలో జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు.
👉 పరిశుభ్రత పారిశుద్ధ నిర్వహణ వీధి దీపాలు త్రాగునీటి సౌకర్యం వంటి అంశాలపై ఎన్నికైన గ్రామ మరియు పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు కృషి చేయాలని ఇందులో ప్రజలను పెద్ద మొత్తంలో భాగస్వామ్యం చేయాలని మరియు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు.
👉 గ్రామ మరియు పట్టణ స్థానిక సంస్థలకు కొత్తగా వచ్చిన ఎన్నికైన సర్పంచులు వార్డు కౌన్సిలర్లు ప్రజల అవసరాలను గుర్తించాలని కోరారు. ఇందుకు అవసరమైన నిధులు తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.
👉 ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు బాధ్యతగా మెలగాలని ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఇందులో పేర్కొన్న పది అంశాల అమలుకు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
👉 పుష్కరాలకు నిధుల కోరత ఉండదు !

2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నిధుల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కోరినట్లు తెలిపారు. గతంలో పుష్కరాలు జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వం ముందస్తుగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో పుష్కరాల సమయంలో భక్తులు ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
👉 2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ముందుగానే పనులు పూర్తి అయ్యే విధంగా ప్రణాళికా ప్రకారం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు.
👉 జగిత్యాల జిల్లా సాగునీటి రంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి సమస్యల పరిష్కారానికి మరియు అత్యధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు
👉 గిరిజన సంక్షేమ మంత్రిగా జగిత్యాల జిల్లాలో అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కోసం నిధుల మంజూరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలు, ప్రతిపాదనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
👉 జగిత్యాల సమీపంలో చలిగల్ గ్రామంలోని భూముల్లో కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

👉 ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రానున్న మూడు సంవత్సరాలు అన్ని గ్రామాల్లో మరియు పట్టణాల్లో ప్రజలకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి వివరించారు.
👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ
కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యతతో పనిచేయాలని కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద మొత్తంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద మొత్తంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని కోరారు.
👉 కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ….
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లా అభివృద్ధికి అందరూ ప్రజాప్రతినిధులు చేయాలని కోరారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని, కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు హక్కులు, బాధ్యత తెలుసుకోవాలని అన్నారు.
ప్రజల ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులపై నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో చూపాలని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజా ప్రజలు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు
👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ...
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో పారిశుధ్యం, తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ లు, వార్డు కౌన్సిలర్లు మరియు సర్పంచులు తమ ప్రాంత సమస్యలను గుర్తించి అధికారులు కలిసి పరిష్కార మార్గాలు కనుగొని, పరిష్కారమయ్యే విధంగా సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని రోజువారి నివేదికల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లాలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
అంతకుముందు ప్రజా పాలన – ప్రగతి లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న 10 అంశాల జిల్లాలో అమలుకు సంబందించిన PPT గురించి సుదీర్ఘంగా వివరించడం జరిగింది.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న 10 అంశాల వారిగా చేపట్టిన కార్యక్రమాలను ప్రగతి నివేదికలు తయారుచేసుకోవాలని, రోజు వారు జరిగే కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేయాలని అందుకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు.
ఈ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా అందరికీ మధ్యాహ్నం భోజనం అందించడం జరిగింది. తదనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లోని పది అంశాలను సంబంధిత జిల్లా స్థాయి అధికారులు వివరించడం జరిగింది .
అలాగే “ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం” అనే గోడ పత్రికను సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా డి ఆర్ డి ఏ మరియు స్వచ్ఛభారత్ టీం ఆధ్వర్యంలో సిగ్నేచర్ కంపెయిన్ మరియు సెల్ఫీ పాయింటును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాజాత కళాకారుల బృందం చే ఏర్పాటుచేసిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
