తుమ్మేనాల మాజీ సర్పంచ్ సత్యమ్మ మృతి !

J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం తుమ్మేనాల గ్రామ మాజీ సర్పంచ్  శేకెల్లి సత్యమ్మ (59) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.

ముంబై నగరంలో నివాసముంటున్న సత్యమ్మ గత శనివారం ముంబాయిలో వైద్య పరీక్షలకు ఆసుపత్రికి వెళ్ళగా గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్స అందిస్తుండగా మరోసారి గుండెపోటు రావడంతో పాటు బ్రెయిన్ డెడ్ అయింది..  వైద్యుల సూచనల మేరకు అంబులెన్స్ లో వెంటిలేటర్ సహాయంతో శుక్రవారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు.

సత్యమ్మ భర్త   శేకెల్లి  రాములు, ముంబై సిటీ మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిగా, ఆంధ్ర మహాసభ ట్రస్ట్ సభ్యుడిగా, బిల్డర్ గా కొనసాగుతున్నారు. మాజీ సర్పంచ్ సత్యమ్మ మృతి పట్ల  పలువురు సంతాపం వ్యక్తం చేశారు.