అధికారంలోకి రావడానికి మహిళా కాంగ్రెస్ ది కీలక పాత్ర !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో 2023 లో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడానికి మహిళా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మహిళా కాంగ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ తొలిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ నేతలతో బుధవారం కరీంనగర్ లోని ఇందిరా భవన్ లో సమావేశం నిర్వహించారు.

👉 ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్ర మహిళలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని మరోసారి  అధికారంలోకి  తీసుకొని రావడానికి రాష్ట్ర మహిళలకు చేయూత అందించాలని  మంత్రి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు అని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ముందుకు సాగుతున్నారని మంత్రి అన్నారు.

మహిళల పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు మహిళలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకు బస్సులు నడపడంతో పాటు సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళలు అనుకుంటే సాధించనిది ఏదీ లేదని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపంచంలోనే శక్తి వంతమైన మహిళగా రాణించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు.
రాష్ట్రంలో మరో మారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మహిళా కాంగ్రెస్ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.


👉 మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి..
కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. !

రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్వర్ణ తెలిపారు. ఆర్టికల్ 73 , 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు.

బీజేపీ పార్టీ మానవత్వం లేని పార్టీగా ఆమె అభివర్ఢించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు మహిళలను పట్టించుకోలేదని స్వర్ణ ఆరోపించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామానికి, ఇంటింటికి తిరిగి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని స్వర్ణ పిలుపునిచ్చారు.

సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్,  కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు మున్సిపల్ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.