సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి !

👉 ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR,

పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి తో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు సంబంధించి బుధవారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమక్షంలో సమావేశం జరిగింది.

👉 మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల పోస్టర్‌, పుష్కరాల టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివరించారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…..

సరస్వతి అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.