👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J .SURENDER KUMAR,
రానున్న గోదావరి పుష్కరాలు 2027 రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దుల, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్ ప్లాన్, గోదావరి నది తీరం వెంట పుష్కర ఘాట్లు పై మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అభివృద్ధి పనులను ఏర్పాట్లను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు.
👉 కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ…..

2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఘాట్లు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి రాజ గౌడ్ , జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, పంచాయితీ ఈ ఈ పి ఆర్, ధర్మపురి తహసీల్దార్ శ్రీనివాస్,మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
