బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు సోమవారం భూమి పూజ నిర్వహించారు.

👉 గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం మేరకు ₹198 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

👉 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , వివేక్ వెంకటస్వామి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఇతర ప్రజాప్రతినిధులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు అధికారులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

👉 ముఖ్యమంత్రి  ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం అందించారు.