J.SURENDER KUMAR,
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన గోపురాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో పాటు ధర్మారం మండల ప్రజలపై ఉండాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానని మంత్రి కానీ ఇచ్చారు.
👉 మానవత్వం చాటుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ మేడిగడ్డకు వేగంగా వెళ్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ కాన్వాయ్ ఓకే సారీ ఆగిపోయి రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లి కూతుళ్ల కు చేయూతనిచ్చి మంత్రి మానవత్వం చాటుకున్నారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ కాన్వాయ్ వెళ్తుండగా స్కూటీపై వెళుతున్న తల్లి కూతుళ్లు తమ వాహనం స్కిడ్ అయి కింద పడ్డారు. మంత్రి వాహనంతో పాటు, ఎస్కార్ట్ నిలిపి మంత్రి, పోలీసులు, గాయపడ్డ వారిని పరామర్శించి వాటర్ బాటిల్ అందించారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించేలా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఏర్పాట్లు చేశారు.
