సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన ప్రముఖులు !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని, ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్  బుధవారం తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

👉 జి ఆర్ ఎం బి చైర్మన్ !

గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్‌ పి. దోర్జీ గ్యాంబా  ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ భేటీలో నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్  కూడా పాల్గొన్నారు.

👉 నూతన డిజిపి !

రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్  కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన డీజీపీ కి అభినందనలు తెలియజేశారు.