J SURENDER KUMAR,
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న చండీగఢ్‌లో నిర్వహించనున్న “చింతన్ శివిర్” కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ నెల 25న చండీగఢ్‌కు వెళ్లనున్నారు..
ఈ చింతన్ శివిర్ లో మేధావులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు పాల్గొని సామాజిక న్యాయం, సాధికారత తదితరు అంశాలపై మేధోమధనం చేయనున్నారు.
ఈ నెల 25వ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి మంత్రి బయలుదేరుతారు. రాత్రి చండీగఢ్‌లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చండీగఢ్ ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు అధికారిక వైర్లెస్ సమాచారాన్ని పంపించారు.
