👉 అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం !
👉 చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తాం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
రైతుల ప్రయోజనమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని ,
అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తాం నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడితే సహించేది లేదని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
ధర్మపురి నియోజకవర్గంలో రోళ్లవాగు, అక్కెపెల్లి ఎత్తిపోతల పథకంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి అక్కెపెళ్లి ఎత్తిపోతల పథకాన్ని ఈ మంత్రి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
ధర్మపురి నియోజకవర్గంలో 90 శాతం మంది వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు.

👉 నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించడానికి రోళ్ళవాగుతో పాటు అక్కెపల్లి ఎత్తిపోతల పథకం, వెల్గటూర్ చెరువు, స్తంభంపల్లి, రంగదామంపల్లి, యశ్వంతరావుపేట చెరువు కూడికతీత పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో ని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి అంచనాలు పెంచి మధ్యలోనే నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించే రోళ్ల వాగు ప్రాజెక్ట్ భూ సేకరణ చేయకుండానే పనులు ప్రారంభించారని మంత్రి అన్నారు.
👉 రోళ్లవాగు ప్రాజెక్ట్ విషయంలో ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ₹ 60 కోట్ల అంచనాలతో 2016లో ప్రారంభించి ₹140 కోట్లకు పెంచారని మంత్రి ఆరోపించారు.
👉 అంచనాలు పెంచిన ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదో మాజీ మంత్రి కొప్పుల సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
👉 రిజర్వ్ ఫారెస్ట్ అనుమతి లేకుండానే రోళ్లవాగు ప్రాజెక్టు ప్రారంభించారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ళవాగు ప్రాజెక్టు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకువచ్చి ఇందుకు సంబంధించి అటవీ శాఖకు ₹ 31 లక్షలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.

👉 అక్కపెల్లిఎత్తిపోతలకు సంబంధించి కనీసం డ్రాయింగ్ పనులు చేయించలేని కొప్పుల ఈశ్వర్ తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 వారం రోజుల క్రితం అక్క పెళ్లి ఎత్తిపోతలకు సంబంధించి డ్రాయింగ్ పనులు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. త్వరలోనే అక్కపెల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
👉 పత్తిపాక రిజర్వాయర్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రాజెక్టుగా నామకరణం చేసి పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
👉 ధర్మపురి నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేస్ -2లో భాగంగా వందల ఎకరాల భూములు సేకరించి స్థానిక రైతులకు చుక్కనీరు ని ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పించి పనులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు.

👉 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో చర్చించి నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తిచేసి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులు ఉన్నారు.
