రేపటి నుంచి ధర్మపురి నరసింహుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం !

👉ఏప్రిల్ 22 నుండి 30 తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు బుధవారం తెల్లవారుజామున నుంచి  అంగరంగ వైభవంగా ప్రారంభం కాన్నాయి అని కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

👉 ఈ నెల 22 నుండి  30  వరకు నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి  బుధవారం ఉదయం 6-00 గం॥లకు మంగళ వాయిద్యములతో గోదావరి నది నుండి పవిత్ర జలాలు అర్చకులు తీసుకువస్తారు

ఉదయం  8  గం॥లకు పుణ్యాహవచనము, ఋత్విక్వరణము, కలశస్థాపన, అభిషేకము, సాయంత్రం 5 గం॥లకు వేదోక్తముగా సహస్ర కలశస్థాపన, నవగ్రహ యోగిని, వాస్తు, క్షేత్రపాలక స్థాపనలు అర్చనాది ఆరాధనా కార్యక్రమము నిత్య హోమములు జరుగుతాయి.

👉 ఉత్సవాలలో ప్రధానమైనవి.

👉 25 న  శనివారం  అన్నకూటోత్సవం !

👉 26 న  ఆదివారం సహస్ర కలశోదకములతో స్వామి వారికి అభిషేకము !

👉 27 న  సోమవారం రోజున స్వామి వారికి చందనోత్సవము నిర్వహించబడును !

👉 28 మంగళవారం   సాయంత్రం గోధూళి సుముహూర్తమున వసంతోత్సవము మరియు పల్లవోత్సవము, నిర్వహించబడతాయి.!

👉 29 న  బుధవారం లక్ష తులసీ అర్చన వైభవముగా జరుగుతాయి..!

👉 30 న  గురువారం శ్రీ నృసింహ జయంతి ఉత్సవం, సాయంకాలం స్థంభోద్భవలో స్వామివారికి విశేషపూజలు జరగనున్నాయి !

👉 స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో..


ఆలయ ప్రాంగణంలో ప్రతినిత్యము లక్ష్మీ సూక్త సంపుటీకరణము, లలిత, విష్ణు సహస్రనామ పారాయణము జరుగును.!

  నృసింహ నవరాత్రోత్సవములను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు  ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ మరియు అనుబంధ ఆలయములకు పూల అలంకరణతోపాటు భక్తులకు తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేపట్టారు