👉 ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ లో వివరాల నమోదు !
J.SURENDER KUMAR,
దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన 2027లో భాగంగా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం అన్ లైన్ లో వివరాల నమోదు చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జనగణన చేస్తున్న విషయం తెలిసిందే.. జనగణలో భాగంగా మంత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి లోని తన క్యాంప్ కార్యాలయంలో వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశారు.

ప్రభుత్వం చేపట్టిన జనగణనకు ప్రతి ఒక్కరు సహకరించి వివరాలను నమోదు చేయాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
