రహదారుల నిర్మాణం కోసం కేంద్ర మంత్రులను కలుస్తాం !

👉 పుష్కరాల పనుల పై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం రాయపట్నం నుండి ధర్మపురి వరకు ఉన్న నేషనల్ హైవే 63 అభివృద్ధి పనుల నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్గరిని కలిసి నిధులు సమకూర్చాలని కోరుతామని ఎస్టి దివంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు
ధర్మపురి క్షేత్రం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణకు ఉన్న ఇబ్బందులను స్థానికులతో చర్చించి భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే విధంగా స్థానిక నేతలు, అధికారులు చోరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.

గోదావరి పుష్కరాల పనులతో పాటు ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని  మంత్రి  లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులతో ధర్మపురిలో  పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని అన్నారు. అధికారులు ఇప్పటికే తయారుచేసిన ప్రణాళికలు మరో మారు పున సమీక్షించి ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు రాకుండ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పుష్కరాలు కావాల్సిన నిధుల కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని మంత్రి తెలిపారు.