జీవన్ రెడ్డి మర్యాదను నేను ఏనాడు తగ్గించలేదు!

👉 హైదరాబాద్ లో  జగిత్యాల కాంగ్రెస్ నాయకుల తో సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

జీవన్ రెడ్డిని నేను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు… ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు. జగిత్యాల కాంగ్రెస్ ముఖ్య నేతలు వచ్చి కలిశారు. తాజా పరిస్థితుల నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను అని సీఎం అన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులతో ఏం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి మాట్లాడారు.


👉 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం. పార్లమెంటు ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం. కానీ, ఆయన నిజామాబాద్  నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు.


👉 మొండి పట్టుతో జీవన్ రెడ్డి  పార్టీ వీడారు. 40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి… దుర్మార్గుడైన కెసిఆర్ తో జతకట్టారు.


👉 జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం. ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదు.


👉 మీరంతా అండగా నిలబడండి… మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం. ధైర్యంగా ఉండండి…త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా.


👉 అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నాను సీఎం అన్నారు.


👉 జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది.. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే ఆదరించి 1985 లో  కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది..


👉 ఎమ్మెల్యేగా తొమ్మిది సార్లు పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది..ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రి గా కూడా ఆయనకు అవకాశం వచ్చింది..


👉 ఎమ్మెల్సీ గా ఒక సారి, ఎంపీగా మరో సారి కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేశారు.. 2023 లో జగిత్యాల శాసనసభ్యుడిగా  పోటీ చేసి ఓడిపోయారు.. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి  వీచినప్పుడు ఆయన ఓడిపోయారు..


👉 ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికి తాను ఎంపీ గా పోటీ చేస్తానని పట్టుపట్టి నిజామాబాద్ టికెట్ తీసుకున్నారు.. తన సొంత నియోజకవర్గం జగిత్యాలతో పాటు కోరుట్ల లో లక్ష మెజార్టీ తీసుకువచ్చి గెలుస్తానని ఆయన ఆనాడు పార్టీకి చెప్పారు.. కాని నిజామాబాద్ ఎంపీగా  1,09,241 ఓట్ల మెజార్టీ జీవన్ రెడ్డి ఓడిపోయారు..


👉 ఆయనకు సొంత నియోజకవర్గం జగిత్యాలలో కేవలం 1847 ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చింది..
జగిత్యాలలో జీవన్ రెడ్డికి 76,145 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి అర్వింద్ కు 74,298 ఓట్లు వచ్చాయి.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సానుభూతి కూడా సొంత నియోజకవర్గ ప్రజలు ఆయనపైన చూపించలేదు..


👉 ఇక కోరుట్లలో యాభై వేల మెజార్టీ ఖాయమని జీవన్ రెడ్డి చెప్పారు.. కాని అక్కడ బీజేపీకి వచ్చిన మెజార్టీ 32952 ఓట్లు..కోరుట్లలో జీవన్ రెడ్డికి 59,704 ఓట్లు మాత్రమే వచ్చాయి. అర్వింద్ కు 92,656 ఓట్లు వచ్చాయి.. ఎంపీగా పోటీ చేసిన జీవన్ రెడ్డికి తన సొంత ప్రాంతాల్లో కూడా జనం ఓట్లు వేయలేదు.. ఎందుకు ఇలా జరిగిందో జీవన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి..  


👉 పీసీసీ అధ్యక్ష పదవి కావాలని జీవన్ రెడ్డి కోరుకున్నారు. కాని పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అంతా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు..

👉 పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానం గౌరవించి పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి కి ఇచ్చింది.. బీఆర్ఎస్ పైన ఆయన అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు.. దీన్ని జీవన్ రెడ్డి సహించకపోతే ఎలా…

👉 బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి ఎలా తీసుకుంటారని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.. ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారే.. అప్పుడు జగిత్యాల  కాంగ్రెస్ నాయకులకు ఆయన అన్యాయం చేసినట్లే కదా..


👉 తనకు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను ద్రోహం చేసి నాదెండ్ల భాస్కర్ రావుతో చేతులు కలిపిన చరిత్ర ను కూడా మేం బయటకు తీయగలం.. కాని ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడటం లేదు..


👉 జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.. పార్టీ ఫిరాయింపులతో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను జీవన్ రెడ్డి ఎలా తన ఇంట్లోకి రానిచ్చాడు..


👉 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని పార్టీలకు పార్టీలను మింగేసిన బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి ఎలా చేరతారు.. ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్న కేసీఆర్ కు జీవన్ రెడ్డి ఎలా జై కొడుతున్నారు..


👉 ఇంత కాలం కల్వకుంట్ల కుటుంబంపైన  మాట్లాడిన మాటలను జీవన్ రెడ్డి  వెనక్కి తీసుకుంటున్నాడా..కేవలం తనకు పదవి రాలేదన్న కారణంతోనే జీవన్ రెడ్డి పార్టీ ని వీడారు.. పదవి రాకపోవడానికి కారణం పార్టీ కాదు.. ఆయనే కారణం


👉 ప్రజల్లో ఆదరణ కోల్పోయి దాన్ని రేవంత్ రెడ్డి పైకి పార్టీ పైకి నెట్టాలని జీవన్ రెడ్డి చూస్తున్నారు.. ఆయన కు కాంగ్రెస్ చాలా గౌరవం ఇచ్చింది..పదవులు కూడా ఇచ్చింది రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగత ద్వేషం, ఈర్షతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నాడు..