👉 నేడు జగిత్యాల కెసిఆర్ సభలో… ఆవిష్కృతం..
J SURENDER KUMAR,
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి నిదర్శనమే సోమవారం జగిత్యాల పట్టణ నడిబొడ్డున సాయంత్రం జరగనున్న బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆవిష్కృతం కానున్న దృశ్యం..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, బి ఆర్ఎస్ లో కెసిఆర్ సమక్షంలో జగిత్యాలలో సభలో చేరనున్న విషయం తెలిసిందే..
👉 నాడు కె సిఆర్, జీవన్ రెడ్డిలు ప్రత్యర్థులు...
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 2001 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు టిఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కొంతకాలం మిత్ర ధర్మాన్ని కొనసాగించారు.
స్వర్గీయ మాజీ మంత్రి సత్యనారాయణ, సవాలు చేయడం కెసిఆర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం, తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కెసిఆర్ తో పోటీపడ్డారు, 2006 లోను మరోసారి జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి అంచు వరకు వెళ్లి స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
👉 బీఆర్ఎస్ లోని మాజీ మంత్రులు కూడా ప్రత్యర్థులు !
జగిత్యాల కు చెందిన మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్ , 1985 లో జగిత్యాల అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా , మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజేశం గౌడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి టిటిడి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజేశం గౌడ్ బి ఆర్ ఎస్ లో కొనసాగుతున్నారు కెసిఆర్ ప్రభుత్వంలో మొదటి ఆర్థిక సంస్థ చైర్మన్ గా పదవి అనుభవించారు.
1994 ,2009 ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ టీటీడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై పోటీ చేసి గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగి టిఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
నేటి బిఆర్ఎస్ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ లో చేరన్న నేపథ్యంలో నాటి రాజకీయ ప్రత్యర్థులు కెసిఆర్, రాజేశం గౌడ్, ఎల్ రమణ, జీవన్ రెడ్డిలో ఒకే పార్టీలో, ఒకే వేదికపై అగుపించనున్న దృశ్యం జగిత్యాల పట్టణంలో సాయంత్రం ఆవిష్కృతం కానున్నది.
👉 అక్ష తృతీయ సెంటిమెంట్ !
మాజీ సీఎం కేసీఆర్, సహజసిద్ధంగా దైవం పూజలు , యజ్ఞ యాగాలు, వాస్తు, స్థితి, వార నక్షత్రాలు ముహూర్తాలపై అపార నమ్మకం విశ్వాసం ఉన్న విషయం తెలిసిందే..
వరంగల్ జిల్లా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ తర్వాత మొదటిసారి మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల్ బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో సోమవారం అక్షయ తృతీయ పర్వదినం కావడం కాకతాళీయం అయినా కెసిఆర్ కు సెంటిమెంట్ గా అయ్యింది అనేది చర్చ..
👉 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి కాల్పుల ఘటన!
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో 1981 ఏప్రిల్ 20న గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు తమ భూ హక్కుల కోసం, అన్యాక్రాంతమైన భూములను తిరిగి పొందడం కోసం నిర్వహించిన భారీ బహిరంగ జరిగింది. నక్సలైట్ల ప్రమేయం ఉందనే నెపంతో ప్రభుత్వం సభకు అనుమతి నిరాకరించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది.
ఈ ఘటనలో పదుల సంఖ్యలో ఆదివాసీలు అక్కడికక్కడే, మరికొందరు ఆసుపత్రిలో మరణించారు దక్షిణ భారతదేశ జలియన్ వాగ్ గా ఏప్రిల్ 20 ను పిలుస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డ రేవంత్ రెడ్డి , కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ ను ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేశారు..
టిఆర్ఎస్ సమావేశం ఇంద్రవెల్లి ప్రాంతంలో జరగకపోయినా ఏప్రిల్ 20వ తేదీకి ఇంద్రవెల్లిలో ఆదివాసీల తిరుగుబాటు కాల్పుల సంఘటనకు జగిత్యాల లో జరగనున్న బిఆర్ఎస్ సభకు ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.
👉 జగిత్యాల ప్రాంత ఎంపికలో
పోరాటాల పురిటి గడ్డ జగిత్యాలకు పోరాటాల ఉద్యమ చరిత్ర లో ప్రత్యేక స్థానం ఉంది.. 1978 సెప్టెంబర్ 9 భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం లక్షలాది మంది రైతు కూలీల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు జగిత్యాల్ జైత్రయాత్రగా పేరు.
ఈ జై జైత్రయాత్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలలో బడుగు, బలహీన, వర్గాలు రైతు కూలీలు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు, బాంచన్ దొర, బానిస జీవన విధానం భూస్థాపితం అయిందని చెప్పుకోవచ్చు..
👉 అదే మైదానంలో ..
1978 సెప్టెంబర్ 9న జైత్రయాత్ర నిర్వహించిన జగిత్యాల పట్టణ పాత బస్టాండ్ కళాశాల మైదానంలో సాయంత్రం దాదాపు లక్షలాదిమంది తో సభ జరిగింది.. బీఆర్ఎస్ సభ నిర్వహణ కూడా అదే మైదానంలో సాయంత్రం వేళ జరగనున్న సభకు లక్షలాది మందిని తరలించడానికి బిఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం జరగనున్న టిఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సెంటిమెంట్లు తో పాటు నాటి ప్రతిపక్ష నాయకులు నేడు మిత్రపక్ష నాయకులుగా అగుపించనున్నారు.
