👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంట అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ఆదివారం సాయంత్రం హార్వెస్టర్ బావిలో పడిన ప్రమాద స్థలాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.
ఈసందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ మధు మృతదేహాన్ని బయటకు తీసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బావి నుండి మృతదేహాన్ని తీయ డానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. మృతదేహం వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం అయ్యేవరకు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ మండల బాధిత కుటుంబానికి అండగా నిలవాలి మంత్రి సూచించారు.

నందగిరి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న బావితో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు సోమవారం నందగిరి గ్రామాన్ని సందర్శించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి ఫోన్ లో అధికారులను ఆదేశించారు.
