👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
దశాబ్దాల కాలంకు పైగా ఆలయంలో పారిశుద్ధ్య పనులు (స్వీపర్ ) నిర్వహిస్తున్న వారికి నిబంధనల మేరకు జీతాలు పెంచడానికి అవరోధాలు ఏమిటో అని ? రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దృష్టికి తెచ్చి సమస్యను వివరించారు.
గోదావరి పుష్కరాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు, కమిషనర్ హనుమంతరావుకు స్వీపర్లు జీతాలు పెంచాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
సమావేశం అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వీపర్లను ఛాంబర్ కు పిలిచారు.
ఆలయంలో అర్చకులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల వేతనాలు ప్రభుత్వం చర్చించి పెంచామన్నారు. గత అనేకసార్లు స్వీపర్లు తనకు వినతి పత్రాలు ఇస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి కమిషనర్ కు వివరించారు
ఆలయ ఆదాయంలో ఖర్చు 40 శాతం కంటే అతిక్రమించవద్దు ఆలయ ఆదాయం పెంచండి స్వీపర్లకు జీతాలు పెంచి ఇవ్వడానికి అవుతుంది అని కమిషనర్ ఈవోకు సూచించారు. ఆదాయం పెరిగింది ఖర్చు 28 శాతం దాటలేదు అంటూ ఈవో వివరణ ఇచ్చారు. 40 శాతం దాటనప్పుడు జీతాలు పెంచడానికి సమస్య ఏమిటి ? ఆదాయం, ఖర్చు వివరాల నివేదిక ఇవ్వండి అంటూ ఈవోను ఆదేశించారు.
👉 అర్చకులు వేద పండితులు !

తమకు పిఆర్సి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని, గూడెం ఆలయ ఉద్యోగులకు ఐ ఆర్ ఇచ్చారు అని మాకు ఇవ్వడం లేదు అర్చకులు వేద పండితులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. దాతల ద్వారా కొనుగోలు చేసిన స్వామివారి కళ్యాణ ప్రచార రథం మూల పడిందని, ఓ దాత లక్షలాది విలువ గల ఉత్సవ మూర్తులను ఆలయానికి ఇచ్చాడని వివిధ ప్రాంతాలలో స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కమిషనర్ ను కోరారు.
సమగ్ర నివేదిక లో ఆలయ ఆదాయం, ఖర్చు, అదనపు సిబ్బంది వివరాలు, పెండింగ్ పి ఆర్ సి, ఐ ఆర్ తదితర వివరాలు పంపాల్సిందిగా కమిషనర్ ఈవోను ఆదేశించారు.
