ఆర్టీసీ సమ్మెకు మూడు రోజులలో ముగింపు పలికాం !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ సన్మానించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు !

👉 జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 52 రోజులుగా సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదని, నాటి సీఎం కెసిఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని,, మా ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మూడు రోజులలో ముగింపు పలికాము అని , రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శనివారం జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారం జగిత్యాలలోని పొన్నాల గార్డెన్స్ లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆర్టీసీ జేఏసీ నాయకులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లను కలసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి చర్చలు సఫలం కావడానికి చొరవ చూపిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె సమస్యను పరిష్కరించి కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. త్వరలో సీఎం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి  ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు  పొన్నం ప్రభాకర్, వివేక్ తో పాటు తాను ఆర్టీసీ కి చెందిన 24 కార్మిక  సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 52 రోజులు సమ్మె చేస్తే కార్మిక సంఘాలను నాటి ప్రభుత్వ పెద్దలు కనీసం చర్చలకు పిలవలేదని మంత్రి అన్నారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్  ఆవేదన వ్యక్తం చేశారు.

👉 కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి  రుణపడి ఉంటాం!

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాము రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గతంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులు  అండగా నిలుస్తామని మంత్రి కి జేఏసీ నాయకులు హామీ ఇచ్చారు