కల్వకుంట్ల కవిత పార్టీ  టిఆర్ఎస్ !

J SURENDER KUMAR,

జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  సొంత పార్టీ పేరు టిఆర్ఎస్ గా (తెలంగాణ రాష్ట్ర సేన) ప్రకటించారు.

హైదరాబాద్ శివార్లలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కవిత తన పార్టీ పేరును ప్రకటించారు.

👉 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….

తన గత పార్టీ అయిన బీఆర్ఎస్ వల్ల తెలంగాణ తన ఆత్మను కోల్పోయిందని, కొన్ని విషయాల పట్ల తాను సిగ్గుపడుతున్నానని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అయిన కే చంద్రశేఖర్ రావు ప్రతిష్టను తన బంధువులు, పార్టీ నాయకులైన టి. హరీష్ రావు, జె. సంతోష్ కుమార్ దెబ్బతీస్తున్నారని ఆరోపించినందుకు, గత ఏడాది సెప్టెంబర్‌లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ ఆయన విషయం తెలిసిందే.

👉 కవిత  స్పీచ్ పాయింట్స్ !

👉 మన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన
తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ది జీవులు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు

👉 నా జీవితంలో ఇదొక మరుపురాని రోజు
మనందరం కలుసుకొని పనిచేసే విధంగా ఆ దైవం చేసిందని నమ్ముతున్నా


👉 తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు, అనేక రకాల కష్టాలు పడిన, రాష్ట్ర వస్తే చాలని భావించిన వాళ్లకు నమస్కారం


👉 సింగరేణి కార్మికులంటే ఇష్టం, అంతకన్నా ఆడబిడ్డలంటే ఇంకా ఇష్టం


👉 జెన్ జీ వారసులు, యూత్ కు పేరు పేరున నమస్కారం


👉 ఏం జరుగుతుందని ఇవ్వాళ రాష్ట్రంలో చాలా మంది ఎదురుచూస్తున్నారు


👉 20 ఏళ్లుగా నేను, తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర మీకు తెలుసు ఆడబిడ్డలందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా ఊరురా బతుకమ్మ కార్యక్రమం ద్వారా చేశాం


👉 జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యింది


👉 మన సంస్కృతి గురించి చెప్పుకోవటానికి బతుకమ్మ వచ్చాక బలం వచ్చింది


👉 ఇది మా సంస్కృతిని అని బతుకమ్మ పాట ద్వారా పున పరిచయం చేసకున్నాం.


👉 తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది మా జాగృతి ఆడబిడ్డలు


👉 కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనం కలలు కన్నా తెలంగాణ రాలేదు


👉 మన కలలు ఇప్పటికీ కూడా నిజం కాలేదు


👉 కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది.


👉 సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది


👉 ఏ తరహాలో పనిచేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉంది


👉 ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయి


👉 ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికాం


👉 మనం అనుకున్న తెలంగాణ రాలేదని మీకు చెబుతున్నా


👉 ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా


👉 తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది


👉 నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదు


👉 ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలి


👉 అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేన గా వస్తున్నాం


👉 పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చు


👉 అందుకోసమే ఈ పార్టీ మీ ముందుకు వచ్చింది


👉 రాజకీయ పార్టీకి రాజకీయ ఆత్మ ఉండాలి. అజెండా ఉండాలి


👉 బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది


👉 తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా


👉 అమ్మతనంతో, ఆర్ధితో పాలన జరిగినప్పుడే కష్టాలు తీరుతాయి.


👉 రైతాంగ పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఇలా సాగుతూనే ఉంది.


👉 చాకలి ఐలమ్మ, గద్దరన్న, మారోజు వీరన్న సహా అనేక మంది పోరాటం చేస్తేనే ఇలా మార్పులు వచ్చాయి


👉 అమర వీరులు, కేసీఆర్ గారు అనేక మంది కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది


👉 సమ్మక్క సారక్క నాటి నుంచే సామాజిక పోరాటం జరిగింది.


👉 కొండ లక్ష్మణ్ బాపూజీ, పాపన్న గౌడ్, పంతు నాయక్ గారు, జనార్ధన్ రావు గారి స్ఫూర్తిని తీసుకుంటాం.


👉 రాజ్యాంగ బద్దంగా రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం.


👉 తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు ఊరికే రాలేదు