J.SURENDER KUMAR,
దశాబ్దాల కాలంకు పైగా ఆలయంలో పారిశుద్ధ్య పనులు (స్వీపర్ ) నిర్వహిస్తున్న వారికి నిబంధనల మేరకు జీతాలు పెంచడానికి అవరోధాలు ఏమిటో అని ? రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దృష్టికి తెచ్చి సమస్యను వివరించారు.
గోదావరి పుష్కరాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు, కమిషనర్ హనుమంతరావుకు స్వీపర్లు జీతాలు పెంచాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
సమావేశం అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వీపర్లను ఛాంబర్ కు పిలిచారు.
ఆలయంలో అర్చకులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల వేతనాలు ప్రభుత్వం చర్చించి పెంచామన్నారు. గత అనేకసార్లు స్వీపర్లు తనకు వినతి పత్రాలు ఇస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి కమిషనర్ కు వివరించారు
👉 అర్చకులు వేద పండితులు !

తమకు పిఆర్సి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని, గూడెం ఆలయ ఉద్యోగులకు ఐ ఆర్ ఇచ్చారు అని మాకు ఇవ్వడం లేదు అర్చకులు వేద పండితులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. దాతల ద్వారా కొనుగోలు చేసిన స్వామివారి కళ్యాణ ప్రచార రథం మూల పడిందని, ఓ దాత లక్షలాది విలువ గల ఉత్సవ మూర్తులను ఆలయానికి ఇచ్చాడని వివిధ ప్రాంతాలలో స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కమిషనర్ ను కోరారు.
సమగ్ర నివేదిక లో ఆలయ ఆదాయం, ఖర్చు, అదనపు సిబ్బంది వివరాలు, పెండింగ్ పి ఆర్ సి, ఐ ఆర్ తదితర వివరాలు పంపాల్సిందిగా కమిషనర్ ఈవోను ఆదేశించారు.
👉 భవిష్యత్తులో ఉపయోగపడాలి !

పుష్కరాలలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న నిర్మాణాలు భవిష్యత్తులో ప్రజలకు భక్తులకు ఆ ప్రాంతవాసులకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించండి అని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు ఆర్ అండ్ బి ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అధికారులను ఆదేశించారు.
పుష్కరాల సందర్భంగా చేపడుతున్న రహదారులు, భూసేకరణ, వంతెనల , బైపాస్ రోడ్ల నిర్మాణం హెలిప్యాడ్ విఐపి ఘాట్ తదితర దృశ్యాలను అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తో కమిషనర్కు అడిషనల్ కలెక్టర్ కు చూపించారు.
హెలిప్యాడ్ నుండి విఐపి ఘాటు వరకు రోడ్డు నిర్మాణంలో ₹3 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఈ వంతెన ప్రజలకు గాని భక్తులకు గాని ఆ ప్రాంత వాసులకు ఉపయోగపడుతుందా ? అంటూ కమిషనర్ మయా శాఖల అధికారులను ప్రశ్నించారు.
కేవలం పుష్కరాల ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని చెప్పడంతో కోట్లాది రూపాయల, ప్రభుత్వ సొమ్ము తో నిర్మిస్తున్న నిర్మాణాలు భవిష్యత్తులో ఉపయోగపడాలని అలా ప్రణాళిక సిద్ధం చేయాలని కమిషనర్ అధికారుల కు సూచించారు. దాదాపు 8 గంటల పాటు కలెక్టర్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులు పట్టణంలో సంచరించి పరిశీలించారు..
