👉 జగిత్యాలలో త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం.!
👉 మంత్రి అడ్లూరి.. లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
మా ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల మండలం లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని, బాస్కెట్ బాల్ కోర్టును మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
👉 రానున్న విద్యా సంవత్సరం జూన్ లో స్కూల్స్ ప్రారంభానికి ముందు విద్యార్థులకు యూనిఫామ్ తో పాటు పుస్తకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
👉 జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం చెల్ గల్ లోని ప్రభుత్వ భూమిని అప్పగించడానికి తనవంతుగా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ ప్రజా సేవ చేయాలని సంకల్పంతో నియోజకవర్గ అభివృద్ధిపై ముందుకు సాగుతున్నారని మంత్రి అన్నారు.
👉 17 మంది డాక్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు..
ప్రస్తుతం అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులలో 17 మంది విద్యావంతులైన డాక్టర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజల అభిమానంతో వారి విజయం సాధించి ఎమ్మెల్యేలు అయ్యారని మంత్రి అన్నారు.

👉 రాష్ట్రంలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వంలో విద్యకిస్తున్న ప్రాధాన్యంతో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని ఇందుకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి అన్నారు.
👉 జగిత్యాల జిల్లాలో అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి అంచనాలు తయారుచేసి పంపించాలని మంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు మంత్రి అభినందించారు.
👉 సీడ్ ప్లాంట్ తో సహకరించండి..!

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటు చేయవలసిన సీడ్ ప్లాంట్ నిర్మాణం పూర్తి అవ్వడానికి సహకరించాలి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు.
లక్ష్మీపూర్ గ్రామం ఐక్యతకు మారుపేరని ఎమ్మెల్యే అన్నారు. సీజన్ కు అనుకూలంగా పంటలు పండిస్తూ ఊరు పేరుకు తగ్గట్టు రాణిస్తున్నారని ఎమ్మెల్యే గ్రామస్తులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కవితతో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, సంగనభట్ల దినేష్ మరియు మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
👉 మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసర గ్రామాల రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
