👉డ్రగ్స్ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష్యం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!
J.SURENDER KUMAR,
బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని 6 సంవత్సరాల పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘బాల భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ‘మే’ డే వేడుకలతో పాటు బాల భరోసా కార్యక్రమం మరియు “నశముక్త్” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైయ్యారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాలు వయసు వచ్చే వరకు చిన్నారులు వివిధ రకాల వ్యాధుల బారిన పడి అంగవైకల్యానికి గురవుతున్నారని, తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో ఇబ్బంది జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బాల భరోసా’ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారని మంత్రి తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో భాగంగా సున్నా నుండి ఆరు ఏళ్ల వయసున్న చిన్నారులను వివిధ రకాల పరీక్షలు చేసి లోపాలు ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ అందించి ఎలాంటి వైకల్యం రాకుండా చూడడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రి తెలిపారు.

👉 ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో పలువురికి లోపాలను గుర్తించామని మంత్రి తెలిపారు.
👉 వీరికి వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. స్థానికంగా వైద్యం అందుబాటులో లేకుంటే హైదరాబాద్ లో చికిత్సలు అందిస్తామని మంత్రి తెలిపారు.

👉 మేడే సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచి పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపించామని మంత్రి తెలిపారు.
👉 కార్మిక శాఖ ద్వారా అందుతున్న పథకాలను జగిత్యాల జిల్లాలోని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో టాంకాం ద్వారా శిక్షణను అందించి జగిత్యాల ప్రాంత యువత విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

👉 నషా ముక్త్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి పోలీసులు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు.
👉 ఈగల్ టీం పేరుతో ఒక ఐపీఎస్ అధికారిని నియమించి డ్రగ్స్ నిర్మూలనకు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి తెలిపారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

👉 మంత్రి పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో మహిళ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల స్టార్స్ ను ఏర్పాటు చేయగా మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, స్కూటీలు, ఈ ఆటో రిక్షాలను మంత్రి అందజేశారు.
👉 రాష్ట్ర వికలాంగుల సంక్షేమం శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ మాట్లాడుతూ …

గతంలో ఏనాడు లేనివిధంగా దివ్వాంగులకు పరికరాల కొనుగోలు కు ₹ 50 కోట్లు వరకు కేటాయించిందని అన్నారు. ఇందులో జగిత్యాల జిల్లాకు కోటి రూపాయలకు పైగా కేటాయించినట్లు అనిత రామచంద్రన్ వివరించారు.
పలువురు యువతులు ఆన్లైన్ మోసాల బరిన పడి సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల చేతిలో మోసపోతున్నారని అనిత రామచంద్రన్ అన్నారు. తెలంగాణలో ఇటీవల పెరిగిన టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఆందోళన కలిగిస్తున్నాయని యువతులు ఆన్లైన్ మోసాల బారిన పడకుండ జీవిత లక్ష్యాల వైపు దృష్టి మళ్లించాలని ఆమె పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఇప్పటికి 80% భవనాలు పూర్తయ్యాయని అన్నారు.
👉 రాష్ట్ర వికలాంగుల సంక్షేమం శాఖ డైరెక్టర్ శైలజా మాట్లాడుతూ…

5 ఏళ్ల లోపు పిల్లలకు వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల వారు భవిష్యత్తులో దివ్యాంగులుగా మారే అవకాశం లేకుండా పోతుందని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో 18 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించిన శైలజా తెలిపారు. అయితే పరీక్షలు వైద్య పరీక్షలు పూర్తయిన పిల్లలకు తొలిసారిగా జగిత్యాలలో మెడికల్ ట్రీట్మెంట్ జగిత్యాల నుండి ప్రారంభిస్తున్నామని శైలజా వివరించారు.

కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ తో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
