ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలి !

👉 ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాం!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు మూడు రోజులలో పరిష్కరించాం, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని , కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల అండగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రపంచ కార్మిక దినోత్సవం ” మే డే” వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపోలో శుక్రవారం కార్మికులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని జెండా ఆవిష్కరించారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల పోరాట ప్రటిమ మరువలేనిదని మంత్రి అన్నారు. నాడు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం  నాయకులను కనీసం చర్చలకు ఆహ్వానించలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ప్రజలు మార్పు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించామని మంత్రి అన్నారు.

👉ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐదుగురు మంత్రులు 24 సంఘాల ప్రతినిధులతో చర్చించి సమ్మెకు ముగింపు పలికామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 కార్మికుల న్యాయమైన పరిష్కరించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి  పిలుపునిచ్చారు.

👉 ప్రతి కార్మికుడి చెమట చుక్కలతో సమాజ మనుగడ మిళితమై ఉందని,  మప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సోదరులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల ఆర్ టి సి కార్మి కుల సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్ తోపాటు ఆర్టీసీ కార్మికులు నాయకులు పాల్గొన్నారు.