ప్రాజెక్టు 33 గేట్లు తెరిచిన ముగ్గురు ముఖ్యమంత్రులు!

👉 కేంద్ర జలశక్తి  మంత్రి  సీఆర్ పాటిల్  సమక్షంలో !


J.SURENDER KUMAR,


కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి  సీఆర్ పాటిల్  సమక్షంలో ఘనంగా జరిగింది.


👉 ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేయగా, మీట నొక్కి 17వ గేటును  సీఆర్ పాటిల్  ప్రారంభించారు. 18వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , 19వ గేటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు , 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రారంభించారు.


👉 2024 ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా 19వ గేటు దెబ్బతినడంతో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు.


👉 తుంగభద్ర జలాల సమర్థ నిర్వహణ, సాగు మరియు తాగునీటి అవసరాల భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలక మైలురాయిగా నిలవనుంది.