సీఎం రేవంత్ రెడ్డిని కలసిన యాంటీ డంపింగ్ యార్డ్ యాక్షన్ టీం!

J SURENDER KUMAR,


హైదరాబాద్ జవహర్‌ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. డంపింగ్ యార్డును జవహర్‌ నగర్ నగర్ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభ సభ్యులు ఈటల రాజేందర్ , ఎమ్మెల్యే మల్లారెడ్డి , యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. శంకర్ నారాయణ , స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ , మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు జేఏసీ ఇతర ప్రతినిధులు ఉన్నారు.

👉 మాక్స్ విజన్ ….

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ కాసు ప్రసాద రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రి 30వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు.

👉 జహీరాబాద్ నిమ్జ్ ….

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని వెం టెక్నాలజీస్ (VEM Technologies) డిఫెన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకులు, సీఎండీ వి. వెంకట రాజు  జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ నిమ్జ్ (NIMZ) లో కొత్త యూనిట్ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

👉 కిమ్స్….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కిమ్స్ (KIMS) ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ బి. భాస్కర్ రావు  మర్యాదపూర్వకంగా కలిశారు. కిమ్స్ ఆసుపత్రి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు.