కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొనండి !

👉 మంత్రులకు ఆలయ అధికారులు ఆహ్వానం !

J.SURENDER KUMAR,


కొండగట్టు అంజన్న క్షేత్రంలో అంగరంగ వైభవంగా  జరగనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులను  సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ అంజనారెడ్డి హైదరాబాదుకు వెళ్లి ఆహ్వానించారు.

రాష్ట్ర ఎస్సి మరియు ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను,  రవాణా శాఖ  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర రెవిన్యూ ఇండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ ఐఏఎస్ లను స్వామివారి ప్రసాదం, శేష వస్త్రం  అందించి ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలను  ఈనెల 10 నుండి  12. వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చక చిరంజీవి , వేదపండితులు పెద్దన్న శర్మ, సూపరింటెండెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.