👉 రెండు రోజుల పాటు ధర్మపురి లో షెల్టర్ ?
J.SURENDER KUMAR,
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజేలో జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీ దొంగలు ధర్మపురి కి ఈ నెల ఒకటిన పగలు వచ్చి ప్రైవేట్ లాడ్జిలో షెల్టర్ తీసుకున్నట్టు తెలిసింది.
రెండు రోజులపాటు ధర్మపురిలో వారు రిక్కీ నిర్వహించినట్టు చర్చ. ఈనెల 3న (ఆదివారం) ఉదయం 6 గంటలకు లాడ్జింగ్ ఖాళీ చేసి వెళ్లినట్టు తెలిసింది.
కరీంనగర్ లో దొంగతనానికి పాల్పడిన వీరు తిరిగి ధర్మపురి లాడ్జి కు చేరుకున్నారా ? లేదా అనే అంశం ప్రత్యేక పోలీస్ బృందాలు ఆరా తీస్తున్నాయి. పోలీసులు వందలాది సి సి ఫుటేజ్ లను వీరి కదలికల కోసం జల్లెడ పడుతున్నారు.
👉 శాకాహారమే తిన్నారా ?

లాడ్జి నిర్వాహకుడితో హోటల్ నుంచి శాఖాహార భోజనాలు తెప్పించి నీవే పైకి తెచ్చి మాకు రూములో ఇవ్వాలని దుండగులు అన్నట్టు సమాచారం. మూడు భోజనం ప్యాకెట్లలో ఐదుగురు భోజనం చేసినట్టు తెలిసింది. తప్పుడు ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు లాడ్జి నిర్వాహకుడికి ఇచ్చినట్టు సమాచారం.
శుక్ర శనివారాలు దుండగులు ధర్మపురి పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రిక్కీ నిర్వహించారా ,? లేదా ? అనేది సి సి ఫుటేజ్ లను ప్రత్యేక పోలీస్ బృందాలు పరిశీలిస్తున్నాయి.
