ధర్మపురి లో స్థావరం ?  కరీంనగర్ దొంగతనమా?


👉 కలమడుగు అడవుల్లో మరో బైక్ లభ్యం ?


J.SURENDER KUMAR,


కరీంనగర్ పీఎంజేలో జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీ కి ముందుగా దొంగలు ధర్మపురి లో స్థావరం ఏర్పాటు చేసుకొని కరీంనగర్ జ్యువెలరీ షాపులో దొంగలించి తిరిగి ధర్మపురికి వచ్చి ఇక్కడ నుండి పారిపోయినట్టు  పోలీస్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

దొంగలు వాడిన మరో బైక్ మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధి కలమడుగు అడవుల్లో గుర్తించినట్లు సమాచారం.
నిత్యం ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుండి గాక ప్రత్యేకంగా మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి లాడ్జిలలో వసతి గృహాల్లో నివాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. ఐదుగురు దుండగులలో ఒకరి చేతికి కాషాయ దారం ఉన్నట్టు సమాచారం.

పట్టణ నడిబొడ్డున ఓ ప్రైవేట్ లాడ్జిలో అయిదుగురు దుండగులు స్థావరం ఏర్పాటు చేసుకొని మద్దునూర్ రామడుగు దారి గుండా కరీంనగర్కు వెళ్ళినట్టు పోలీస్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి..


ఆదివారం దొంగతనం జరిగిన తర్వాత తిరిగే ఇదే దారి గుండా ధర్మపురికి చేరుకొని కి గోదావరి నదిలోమా లక్ష్మి ఘాటు వద్ద ఓ బైకును హెల్మెట్ ను పారవేసినట్టు చర్చ.


దీంతోపాటు పట్టణంలోని ఓ పెట్రోల్ పంపులో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్ లో పెట్రోల్ పోయించుకున్నట్టు సిసి ఫుటేజీలో నమోదైన దృశ్యాలు పోలీసులు స్వాధీన పరుచుకున్నట్టు సమాచారం. పోలీసులు లాడ్జ్ సీసీ పుట్టేజులు రికార్డులను స్వాధీన పరుచుకుని విచారిస్తున్నట్టు సమాచారం.