👉 గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక చర్చలు !
J.SURENDER KUMAR,
మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల తో షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం, రాష్ట్రంలో చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, యువతలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై మంత్రి గవర్నర్‌కు వివరించారు.

ఈ నెల 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, యువజన చైతన్య కార్యక్రమాల వివరాలను మంత్రి గవర్నర్‌కు మంత్రి తెలిపారు.
