ఘనంగా నరసింహ జయంతి ఉత్సవం !

👉 స్వామివారిని దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురిలో “శ్రీ నృసింహనవరాత్రోత్సవములలో” భాగంగా చివరి రోజు గురువారం   నృసింహ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్, తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది.

ఈ సందర్భముగా శ్రీస్వామి వారికి పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, సహాస్రనామార్చన, పంచోపనిషత్తులతో మరియు మన్యసూక్తముతో మరియు సున్నాల వన్నము మరియు రుద్రముతో అభిషేక పూజలు, విశేష పూజలు మరియు పంచోపనిషత్తులతో అభిషేకము, సహస్రనామార్చన, హారతి వేదమంత్ర పుష్పము మరియు చతుర్వేద అవధార్యములు మరియు భజన కార్యక్రమములు జరిగాయి..

👉 స్థంభోద్భవ కాలవిశేష పూజలు !

ఆలయంలో సాయంత్రం స్థంభోద్భవ కాలము విశేష పూజలు జరిగాయి. నృసింహ జయంతి సందర్భముగా రాజగోపురములకు, శ్రీస్వామి వార్లకు, దేవాలయములకు ప్రత్యేక పూల అలంకరణ చేశారు. “నృసింహ జయంతి” సందర్భముగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శ్రీస్వామి వారి అభిషేకములో పాల్గోని శ్రీ యోగ, ఉగ్ర & వేంకటేశ్వర స్వామి వారలకు నూతన వస్త్రములు సమర్పించి ప్రత్యేక పూజలు  చేశారు.అనంతరం దేవస్థాన పక్షాన  శ్రీస్వామి వారి శేషవస్త్ర ప్రసాదం దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ సంకటాల శ్రీనివాస్ మంత్రికి అందించారు  .

ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ,, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, అర్చకులుసిహెచ్ రమణయ్య  నంబి నర్సింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ చక్రపాణి కిరణ్, అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, స్థానిక వేదపండితులు పెండ్యాల శంకర్ శర్మ, కొరిడె విశ్వనాథ శర్మ, తాడూ బాలకిష్టయ్య శర్మ, తాడూరి బలరాం శర్మ, సంఘనపట్ల.దిలీప్ శర్మ, పెండాల.రాజేష్ శర్మ, నంద్యాల.చంద్రశేఖర్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువా శ్రీనివాస్ పాల్గొన్నారు.