నేడు నూతన డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు !

J SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్  గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన డీజీపీ కి అభినందనలు తెలిపారు.

👉 నేపథ్యం ,

1968లో హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో టాపర్‌గా నిలిచారు. నిజాం కాలేజీ , ఉస్మానియాలో ఉన్నత విద్య పూర్తి చేశారు.
22 ఏళ్లకే తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.


👉 కెరీర్‌లో…

సివి ఆనంద్ తన 35 ఏళ్ల సర్వీసులో దాదాపు అన్ని రకాల కీలక విభాగాల్లో పనిచేశారు:


నక్సల్స్ తో రాజీలేని పోరు:


కెరీర్ మొదట్లో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో నక్సలైట్లపై పోరాడి ‘ప్రెసిడెంట్స్ గ్యాలంట్రీ మెడల్’ సాధించారు.


ట్రాఫిక్ సంస్కరణలు:


హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో e-challanDrunk and Driving తనిఖీలను కఠినంగా ప్రవేశపెట్టింది ఆయనే.


మహిళా భద్రత:


సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పుడు SHE Teams, SHE Shuttles వంటి కీలక కార్యక్రమాలను బలోపేతం చేశారు.


శాంతిభద్రతలు:


హైదరాబాద్ కమిషనర్‌గా వినాయక చవితి, బక్రీద్ వంటి పండుగలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించి మెప్పించారు.

టెక్నాలజీ:

డ్రగ్స్ నియంత్రణ కోసం H-NEW , సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.


👉 ఇతర శాఖల్లో ..


పౌర సరఫరాలు:

రేషన్ షాపుల్లో e-POS మెషిన్లు పెట్టి, అవినీతిని తగ్గించి ప్రభుత్వానికి వేల కోట్లు ఆదా చేశారు.


విమానాశ్రయ భద్రత:


కేంద్ర సర్వీసుల్లో (CISF) ఉండి దేశవ్యాప్త ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షించారు.


👉 క్రీడా కారుడు


సి.వి. ఆనంద్ కేవలం ఆఫీసర్ మాత్రమే కాదు, గొప్ప క్రీడాకారుడు: క్రికెట్‌లో రంజీ ట్రోఫీ స్థాయి వరకు వెళ్లారు.
50 ఏళ్లు దాటినా టెన్నిస్, క్రికెట్ ఆడుతూ శతకాలు బాదుతూ చాలా ఫిట్‌గా ఉండటం విశేషం.

👉 అవార్డులు

అత్యున్నత సాహస పతకం (PMG).

రాష్ట్రపతి పోలీస్ పతకం (PPM).


దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో డ్రగ్స్ నియంత్రణకు గాను అంతర్జాతీయ బహుమతి.

సి.వి. ఆనంద్ క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారి. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అదుపు చేయడంలో , క్రీడా స్ఫూర్తితో సిబ్బందిని నడిపించడంలో దిట్ట.