జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు..!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

ఇటీవల క్యాబినెట్ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం చర్చకు వచ్చిందని త్వరలోనే జర్నలిస్టు మిత్రులకు ఇళ్లస్థలాలు అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆలోచన చేస్తున్నట్లు మంత్రి లక్ష్యం కుమార్ తెలిపారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి అన్నారు.

2011- 12 లో ఖిలావనపర్తి గ్రామంలో థర్మల్ పవర్ స్టేషన్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రయత్నించగా జిల్లా పరిషత్ చైర్మన్ గా తాను అడ్డుకున్నానని మంత్రి తెలిపారు. గ్రామంలో ఒక గజ స్థలం పోకుండా కాపాడానని మంత్రి గుర్తు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక రథం తయారు చేయించాలని ఇందుకు ధనవంతుగా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భోజనశాల నిర్మాణానికి ఇప్పటికే ₹15 లక్షలు నిధులు విడుదల చేశామని మరో ₹ 10 లక్షలు నిధులు విడుదల చేసి డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి ఏ విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.