👉 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
J.SURENDER KUMAR,
గడిచిన రెండున్నర ఏళ్ల ప్రజా పాలనలో ధర్మపురి నియోజకవర్గంలోని 474 రైతులకు రైతు బీమా పథకం ద్వారా ₹ 18 కోట్ల 7లక్షలు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలిపారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మపురి నియోజకవర్గస్థాయి సమావేశం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
రైతు భరోసా పథకంలో 1,21,851 మంది రైతులకు ₹ 188 కోట్ల 48 లక్షలు అందజేసినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని 21, 917 మంది రైతులకు ₹161 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేసినట్లు మంత్రి తెలిపారు.
👉 గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ యాంత్రీకరణను తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గాల్లోని 124 మంది రైతులకు ₹ 54 లక్షల 35 వేల విలువైన వ్యవసాయ యంత్రాలను అందజేసినట్లు మంత్రి తెలిపారు.

👉 నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 3104 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసి ₹139 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు.
👉 గృహజ్యోతి పథకంలో 49వేల 444 మంది లబ్ధిదారులకు 200 లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. చేయూత పెన్షన్ పథకం ధర 49 వేల 299 మంది లబ్ధిదారులకు ₹ 10 కోట్ల 97 లక్షల రూపాయలను జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
👉 కళ్యాణ లక్ష్మి పథకంలో 2862 మందికి ₹ 10 కోట్ల 91 లక్షలు రూపాయలు అందించినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో 15,835 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.
