ఉలిక్కిపడ్డ  ధర్మపురి…..

J.SURENDER KUMAR,

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజేలో జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీ దొంగలు ధర్మపురిని స్థావరంగా చేసుకున్నట్టు వెలుగు చూడడంతో ధర్మపురి పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు.

కరుడుగట్టిన ఐదుగురు దొంగల ముఠా షార్ట్ వెప్పల్స్ తో రెండు రోజులపాటు ధర్మపురిలో సంచరించడం సంచలనంగా మారింది.. దోపిడి దొంగతనానికి ముందస్తుగా ధర్మపురిలో స్కెచ్ వేశారా ?  అనే కోణంలో ప్రత్యేక పోలీసు బృందాలు వివిధ కోణాలలో ఆరా తీస్తున్నారు..


పట్టణ నడిబొట్టును జనావాసాల మధ్య  లాడ్జిలో షెల్టర్ తీసుకున్న దొంగలు శుక్రవారం సాయంత్రం శనివారం లాడ్జి నుండి బయటకు వెళ్లి కొన్ని గంటల తర్వాత తిరిగి లాడ్జికి చేరుకున్నట్టు సమాచారం
.

శనివారం ధర్మపురిలో పెద్ద ఎత్తున వారసంత కొనసాగుతుంది. కాలినడకన రాకపోకలకే కష్టతరం.. ఈ దశలో దొంగతనం చేసి వాహనాలపై పారిపోవడం సాధ్యం కాకపోవచ్చు అని దొంగలు కరీంనగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు పోలీస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.

వివరాలు సేకరిస్తున్న దృశ్యం

లాడ్జి నిర్వాహకుడికి వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ మరో రాష్ట్రానికి చెందినది గా సమాచారం. గతంలో లాడ్జిలో ఉన్న వారి వివరాల రికార్డులను పోలీసులు స్వాధీన పరుచుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఫోన్ కాల్ డాటా, సెల్ టవర్ లొకేషన్ డాటాను, సాంకేతిక పరిజ్ఞానంతో డి కోడ్ చేస్తూ అనుమానిత సెల్ ఫోన్ నెంబర్లు వాటి రిజిస్ట్రేషన్ తదితర వివరాలను ఆయా సెల్ ఫోన్ కంపెనీల నుండి పోలీస్ వర్గాలు నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. దాదాపు ఆరు గంటల పాటు ప్రత్యేక పోలీసు బృందాలు లాడ్జి నిర్వాహకుడి నుండి వివరాలు సేకరించి దొంగల కదలికలు నమోదు చేసుకున్నట్టు తెలిసింది.

.